
కేసీఆర్ ఎట్టకేలకు తన ఆగ్రహాన్ని బయటపెట్టాడు. ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దుతో ఆర్థికవ్యవస్త మొత్తం అతలాకుతలం అవుతున్న సంగతి తెలిసిందే.. ప్రజలందరూ పనులు మానేసి ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. దీంతో రియల్ ఎస్టేట్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యక్రమాలన్నీ కూడా ఆగిపోయాయి. ఆదాయం పోయింది. భారత దేశం ఈ నిర్ణయంతో 30 ఏళ్లు వెనక్కి పోతోందని.. కేసీఆర్ మండిపడ్డారు. మేకలు, గొర్రెలు కాసేవారు కూడా ఈ కాలంలో 10 లక్షల లావాదేవీలు చేస్తున్నారని.. వారంతా కూడా నల్ల కుబేరులా అని మండిపడ్డారు. అసలైన వారిని వదిలి మోడీ సామాన్యులను అష్టకష్టాల పాలు చేస్తున్నారని మండిపడ్డారు.
హైదరాబాద్ మోడీ నోట్ల రద్దు వల్ల హైదరాబాద్ లో భారీగా ఆదాయం కోల్పోయామని కేసీఆర్ అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న కేసీఆర్ అందరి నుంచి వ్యతిరేకత వస్తోందని ప్రధానికి, కేంద్రానికి దీనిపై తెలియజేస్తామని స్పష్టం చేశారు.