
మేక కోసం చంపుకునే మనుషులు మనం బతుకుతున్న సమాజంలో ఉన్నాంరటే అతిశయోక్తి కాదు.. ఉత్తరప్రదేశ్ లోని సాలేనగర్ లో ఆదివారం సమయుద్దీన్ అనే వ్యక్తికి చెందిన మేక పొరుగునే ఉన్న జావేద్ ఇంట్లోకి వెళ్లింది. దీంతో జావేద్ కుటుంబ సభ్యులు కేకలు వేశారు. సమయుద్దీన్ కుటుంబ సభ్యులు రావడంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం కర్రలతో కొట్టుకున్నారు. ఆ తర్వాత తుపాకీతో కాల్చుకున్నారు. ఈ ఘటనలో సమయుద్దీన్ చనిపోయాడు..
కేవలం మేక ఇంట్లోకి వచ్చిందని కొట్టుకొని చచ్చిపోయిన ఈ ఘటన సంచలనం రేపింది. ఇరు కుటుంబాల వారు తీవ్ర దెబ్బలు తిని ఆస్పత్రుల పాలయ్యారు.