Breaking News

తాడోపేడో.. వెనక్కి తగ్గేది లేదు..

high-court-kcr

సర్కారు తాను తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పింది. మల్లన్న సాగర్ తో పాటు తెలంగాణలో భూసేకరణ కోసం  తెచ్చిన జీవో 123ని ప్రభుత్వం హైకోర్టు రద్దు చేయడంతో ఉమ్మడి బెంచ్ కు తెలంగాణ ప్రభుత్వం రివ్యూ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణకు స్వీకరించిన హైకోర్టు 8వ తేదీలోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అలాగే తెలంగాణ ప్రభుత్వం జీవో 123లో పేర్కొనని పునరావాస విధానాన్ని ఈసారి ప్రభుత్వం జీవో లో చేర్చుతుందని.. ఈ జీవోను ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రోత్సాహకమైన లాభసాటి పునరావాస వ్యవహారంగా గుర్తించాలని ప్రభుత్వం కోరుతోంది.. దీంతో ఈ విచారణను హైకోర్టు 8వ తేదికి వాయిదా వేసింది..

కాగా వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించే భూముల్లో వ్యవసాయ కూలీలు, వృత్తుల పనివాళ్లు, కౌలుదారులు తదితరుల పునరావాసం, పునర్నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంటేనే పిటీషన్ ను అనుకూలంగా వ్యవహారిస్తామని లేదంటే తిరస్కరిస్తామని చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *