జియో ధాటికి ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ కుదేలు..

Reliance-Jio-vs-Airtel-vs-Vodafone

అవి మామూళ్ల ఆఫర్లా..? ప్రత్యర్థులే భయపడిపోయేలా..? అసలు వణికిపోయేలా.. స్టాక్ మార్కెట్ మొత్తం కుప్పకూలేలా..? ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో రంగ ప్రవేశం చేసింది.. అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. మూడు నెలలు వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్ లు ఫ్రీ అని ప్రకటించింది.. దీంతో అన్ని నెట్ వర్క్ లు బెదిరిపోయాయి. ఇప్పటివరకు దేశంలోనే టాప్ ప్లేస్ లో ఉన్న ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు బెదిరిపోయాయి. ఈ షేర్ లు కూడా స్టాక్ మార్కెట్ లో పడిపోయాయి. మూడు నెలల పాటు దేశం మొత్తం రోమింగ్ లేకుండా కాల్స్ ఫ్రీ అనడంతో ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ వాడుతున్న వినియోగదారులందరూ జియో సిమ్ కోసం ఎగబడుతున్నారు. అందరూ జియోకు మారిపోతున్నారు. పైగా మూడు నెలల అనంతరం 50 రూపాయలకే 1జీబీ డేటా అందిస్తున్నట్టు జియో ప్రకటించింది. దాంతో పాటు 149కే నెలరోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్  ప్రకటించింది. దీంతో జియో సిమ్ లకోసం జనం ఎగబడుతున్నారు.

భారత దేశంలో జియో రంగ ప్రవేశం తద్వారా ఎయిర్ టెల్, ఐడియా, వోడాఫోన్ లు కుదేలయిన తీరును వివరిస్తూ రెజ్లింగ్ బాక్సింగ్ లో పేరడి చేశారు. ఇప్పుడు ఈ వీడియోను చూస్తే తెలుస్తుంది.. జియో ఎంతలా బాదేస్తోందో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *