
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ రెండో సారి కరీంనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచాక తన వ్యాపార సామ్రాజ్యాన్ని భారీ గా విస్తరించారు. కరీంనగర్ లో శ్వేత హోటల్ తో పాటు.. కరీంనగర్ కేబుల్ టీవీ ని కొని దాన్ని స్వేత డిజిటల్ కేబుల్ గా మార్చి జిల్లా వ్యాప్తంగా దాన్ని విస్తరిస్తున్నారు. కాగా ఇప్పుడు కరీంనగర్ లో కేబుల్ టీవీ అంటే అది ఎమ్మెల్యే గంగుల కేబుల్ అన్నట్టు పరిస్థితి మారిపోయింది ..
కానీ ఇది ఎన్నాళ్లో ఉండడం కనిపించడం లేదు. కొత్తగా కొందరు కరీంనగర్ లో కేబుల్ టీవీని ప్రారంభిస్తున్నారు. గంగుల కేబుల్ లో కేవలం 90 చానాల్స్ వస్తే కొత్తగా వెంకటసాయి మైత్రీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ కొత్తగా కరీంనగర్ లో దాదాపు 243 చానాళ్ల ప్రసారాలతో ముందుకు వస్తోంది. అంతేకాదు గంగుల డిష్ బిల్ కంటే తక్కువ రేటును ప్రజలకు ఆఫర్ చేస్తోంది. సెట్ అప్ బాక్స్ ను గంగుల డిష్ కేబుల్ 1700/- ఇస్తుంటే వెంకటసాయి డిష్ వారు కేవలం 499కే ఇస్తున్నారు.. మొదటి మూడు నెలలు డిష్ ఉచితం అని ప్రకటించారు. సంవత్సరం ప్యాకేజీని 1200/- కే ఇస్తున్నారు.. 1699లకే డిజిటల్ బాక్స్ తో 243 చానాళ్లు 15 నెలలు వీక్షించే లా ఆఫర్ ఇస్తోంది.
ఇంత చీప్.. ఇంత భారీగా వస్తుండడంతో జనం వెంకటసాయి డిష్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈరకంగా ఇప్పుడు ఎమ్మెల్యే గంగుల డిష్ కు పోటీ వచ్చినట్టే..