గణేష్ నవరాత్రోత్సవాలు: లహరీ హైట్స్ లో బహుమతుల పంపిణీ

whatsapp-image-2016-09-14-at-3-04-12-pm

గణేష్ ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్  రాంచంద్రపురం కాలనీ లహరీ హైట్స్ లో 9 రోజులుగా నిర్వహించిన గేమ్ షోలు, పాటల పోటీలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమాల్లో విజేతలుగా నిలిచిన లహరీ కుటుంబ సభ్యులకు లహరీ హైట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు బుధవారం బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం వినాయక విగ్రహం ముందు కోలాటాలు, దాండియా ఆటలు ఆడి వినాయకుని నిమజ్జనం కోసం గణపతిని నృత్యాలు చేస్తూ తీసుకెళ్లారు.

whatsapp-image-2016-09-14-at-3-02-04-pm

ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో లహరి హైట్స్ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు అయిలు రమేశ్, అధ్యక్షులు మున్ననూరు రమేశ్, కార్యదర్శి సిరిపురం వేణుకుమార్, సాంస్కృతిక విభాగ కన్వీనర్ జారాతి మధు, కోశాధికారి పాత్కనూరి కిషోర్, సభ్యులు చీకోటి శేఖర్, ఆవల వినోద్, పోకల అశోక్, ఇండ్ల తిరుపతి, చెక్కబండి రవిచంద్రరెడ్డి, మాల్వే తిరుపతి , డాక్టర్ దాసు సత్తిలింగం,   పోలీస్ మహేష్  , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

whatsapp-image-2016-09-14-at-3-02-05-pmwhatsapp-image-2016-09-14-at-3-02-06-pm

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *