
రూ.251కే ఫోన్లు అందజేస్తామని సంచలనం సృష్టించిన ప్రీడమ్ కంపెనీ ఎట్టకేలకు ప్రకటించిన 6 నెలల తర్వాత తన పనిని మొదలుపెట్టింది.. 251 రూపాయలకే బుక్ చేసుకున్న దాదాపు తొలి 30వేల మందికి పంపిణీ చేసేందుకు సిద్ధమయింది. మొదటి విడతలో డెలివరీలో భాగంగా వివిధ రాష్ట్రాల్లో స్వల్ప సంఖ్యలో ఈ ఫోన్ల బట్వాడా చేపట్టింది. హర్యానాలో 390, పశ్చిమబెంగాల్ 540, హిమాచల్ ప్రదేశ్ 484, బీహార్ 605, ఉత్తరాఖండ్ 221 ఫోన్లు మొదటి విడతగా పంపిణీ మొదలుపెట్టింది.
తొలివిడత దాదాపు 5000 ఫోన్లు డెలివరీ చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు 70మిలియన్ల ప్రజలు రూ.251ఫోన్ ను బుక్ చేసుకున్నారట.. అయితే ఐటీ, కేంద్ర ప్రభుత్వం వివాదాలు చేయడంతో ఫ్రీడమ్ ఫోన్ల సందిగ్దం నెలకొంది.కానీ కొన్ని ఫోన్లు డెలవరీ చేయడంతో విశ్వాసం పెరిగింది.