నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన

స్వామి రామనంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ రాష్ట్రంలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు మూడు నెలలపాటు ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
భారత ప్రభుత్వ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమం దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ
కౌశల్య యోజనకింద స్వామీ రామనంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది.
మూడు నెలల సాంకేతిక విద్యలు
-ఆటోమొబైల్ -2,3 వీలర్ సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తోపాటు)
-ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్), సోలర్ సిస్టమ్ ఇన్‌స్టలేషన్, సర్వీస్, కుట్టు మిషన్ ఆపరేటర్
-విద్యార్హత: పదోతరగతిలో ఉత్తీర్ణత/కుట్టు మిషన్ ఆపరేటర్‌కు టెన్త్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు.
-డీటీపీ & ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, ట్యాలీ (కంప్యూటరైజ్‌డ్ అకౌంటింగ్), కంప్యూటర్
హార్డ్‌వేర్ అసిస్టెంట్
-విద్యార్హత:గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్‌లో ఉత్తీర్ణత. ట్యాలీకి ఇంటర్(సీఇసీ) ఉత్తీర్ణత.
-శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితం& ఉచిత హాస్టల్, భోజన వసతి కల్పిస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్‌తోపాటు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 2016 నవంబర్ 29, 30న ఒరిజనల్ సర్టిఫికెట్లతో సంస్థలో హాజరుకావాలి.
-తరగతి క్లాసులు ప్రారంభం: డిసెంబర్ 1 నుంచి
-రిజిస్ట్రేషన్ ఫీజు: అభ్యర్థులు రూ. 250/- చెల్లించాలి.
-పూర్తి వివరాలకు ఫోన్ నంబర్: 9948466111, 9133908111, 08685-205013 లేదా జిల్లా డీఆర్‌డీఏ
ఆఫీస్‌లోసంప్రదించవచ్చు

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *