తలుపులు బార్లా..

fdi-boost

దేశంలోని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ద్వారాలు తెరిచారు ప్రధాని మోడీ..రక్షణ, ఔషధ, విమానాయన, ఆహారశుద్ధి రంగాల్లో నూరుశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతిలిచ్చారు. ప్రసార సేవలు, ప్రైవేటు రక్షణ, ఏకబ్రాండ్ ఉత్పత్తుల్లో 50 శాతం నుంచి 70 శాతం వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించారు.

కాగా దీనివల్ల దేశంలోని విదేశాల నుంచి భారీ పెట్టుబడులు రానున్నాయి. దేశం ప్రపంచ తయారీ రంగంగా ఎదగనుంది. దేశంలోని నిరుద్యోగులకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు దక్కుతాయని మోడీ ప్రభుత్వం భావిస్తోంది.ఆర్థిక వ్యవస్థకు ఇది రేసుగుర్రంలా పనిచేస్తుందని మోడీ ప్రభుత్వం ఆశతో ఉంది.

కాగా విదేశీసంస్థలకు కొమ్ముకాయడానికే మోడీ ఇలా చేశారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల వల్ల దేశంలో అధికారం, నియంత్రణ వారికి పోతుందని.. ధరలు వారి ఇష్టానుసారం పెంచుతారని ఇది సరికాదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *