తెలంగాణ వ్యతిరేకి.. తెలంగాణ తల్లి అయ్యింది..

తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ నాడు గొంతెత్తని ఆమె ఇప్పుడు తానే తెలంగాణ తల్లి అని ప్రకటించింది. తెలంగాణ ఏర్పడకుండా ఆంధ్రా నాయకులతో కలిసి ఢిల్లీలో లాబీయింగ్ నడిపిన మహా తల్లి ఇప్పుడు తెలంగాణ ప్రతినిధిగా మాట్లాడుతున్నానని సెలవచ్చింది.. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంటులో చేసిన ప్రసంగం ఆద్యంతం ఆంధ్రాకు న్యాయం చేయాలని.. ఆంధ్రా అన్యాయమైపోతోందనే సాగింది.. తెలంగాణ తల్లిగా మాట్లాడుతున్నానని చెప్పిన ఈ మహా తల్లి తెలంగాణ గురించే మాట్లాడకపోవడం గమనార్హం.. ఖమ్మంలో పుట్టి ఆంధ్రా పంచన చేరిన రేణుకా తాను తెలంగాణ తల్లి నని ప్రకటించుకోవడంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణను అడుగడుగునా అడ్డుకొని… ఇప్పుడు తెలంగాణ ప్రజాప్రతినిధిగా ఉంటూ ఆంధ్రా పాట పాడిన రేణుకపై మండిపడుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *