
ఏడుపు నుంచి నవ్వు.. భయం నుంచి ధైర్యం.. చీకటి నుంచి వెలుగు, ఓటమి నుంచి గెలుపు.. నిస్సత్తువ నుంచి శక్తి .. ఇలా ప్రతి ప్రతికూలను మనకు అనుకూలంగా మార్చేస్తాడు నాన్న.. బిడ్డ పుట్టిన మొదటిక్షణం నుంచి తండ్రి వెళ్లిపోయే ‘చివరిక్షణం’ వరకు అడుగడుగునా బిడ్డకోసమే పరితపిస్తాడు.. తన అనువణువూ బిడ్డ కోసమే అర్పిస్తాడు. తన బిడ్డ వేసే ప్రతీ అడుగులో చిక్కుముడులను తొలగిస్తాడు. నడిచే ప్రతి దారిలో సమస్యలే లేకుండా చేస్తాడు. బిడ్డ ఎదుగుదలే తన ఎదుగుదలలా భావిస్తాడు.. అందుకే నాన్న ఉంటే చాలు పిల్లల్లో ఎక్కడా లేని ధైర్యం వస్తుంది. నాన్న అన్న పిలుపులో అమితమైన ఆత్మీయత లభిస్తుంది.
నేడు ఫాదర్స్ డే సందర్భంగా అందరు నాన్నలకు శుభాకాంక్షలు..