
*నోట్ల రద్దుతో బ్యాంకులు, పోస్టాఫీసులు, ఏటీఎంలలో ప్రజల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరికొన్ని సడలింపులను ప్రకటించింది. బ్యాంకుల్లో డబ్బు విత్ డ్రా, ఎక్సేంజ్ లకు సంబంధించి నిబంధనల్లో మార్పులు చేసినట్టు ప్రకటించారు ఆర్థిక సలహాదారు శక్తి కాంత్ దాస్. మొత్తం ఏడు పరిమితులను ప్రకటించారు.*
*ఆర్బీఐ ఏడు నిబంధనలు ఇవే..*
*రైతుల విత్ డ్రా లిమిట్ పెంపు*
*కిసాన్ కార్డ్ హోల్డర్లు, రైతులు క్రాప్ లోన్ తో సంబంధం లేకుండా రూ. 25 వేల రూపాయల వరకు బ్యాంకు నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.*
*పెళ్లికి 2.5 లక్షలు విత్ డ్రా*
*పెళ్లి ఉన్న ఇంట్లో కేవైసీ(డిక్లరేషన్) సమర్పించి పెళ్లిజంట తల్లిదండ్రులలో ఎవరో ఒకరి అకౌంట్ల నుంచి రూ 2 లక్షల 50 వేల రూపాయల వరకు విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంది.*
*నోట్ల ఎక్సేంజ్ నిబంధనల్లో మార్పులు*
*రేపటి నుంచి బ్యాంకుల్లో నోట్ల ఎక్సేంజ్ కు పరిమితి విధించింది ప్రభుత్వం. రూ 4వేల 500 నుంచి రూ. 2000 వరకు కు మాత్రమే నోట్ల ఎక్సేంజ్ చేసుకోవాలని ప్రకటించింది. అవసమరమున్న వారే కాక చాలా మంది ఎక్కువ మొత్తంలో మనీ విత్ డ్రా చేసుకుంటున్నారన్న కారణంతో ఈ నిబంధనలు విధించినట్టు శక్తి కాంత్ దాస్ ప్రకటించారు.*
*సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఊరట*
*కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నవంబర్ నెల సాలరీ అడ్వాన్స్ కింద రూ 10 వేల రూపాయల వరకు క్యాష్ విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపింది. గ్రూప్ సీ ఉద్యోగుల దాకా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ప్రకటించింది.*
*ట్రేడర్లకు విత్ డ్రా లిమిట్ పెంపు*
*మండి, మార్కెట్ వ్యాపారస్తులకు బ్యాంకుల్లో విత్ డ్రా లిమిట్ ను పెంచింది. వారానికి రూ. 50 వేల రూపాయలను విత్ డ్రా చేసుకొవచ్చని తెలిపింది.*
* క్రాప్ ఇన్సురెన్స్ కు 15 రోజల గడువు పెంపు*
*రైతులు క్రాప్ ఇన్సురెన్స్ చెల్లించేందుకు మరో 15 రోజుల గడువు పెంచింది ప్రభుత్వం. ప్రీమియంకు పాత నోట్లను సమర్పించవచ్చని తెలిపింది.*
* చెక్ ద్వారా రైతులు రూ. 25 వేలు విత్ డ్రా*
*రైతులు బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన చెక్ ద్వారా రూ 25 వేల రూపాయలను విత్ డ్రా చేసుకోవచ్చని ప్రకటించారు ఆర్థిక సలహాదారు శక్తి కాంత్ దాస్.