
ఒక్క షార్ట్ ఫిలిం రైతుల కష్టాల్ని కళ్లకు కట్టింది.. రైతులు ఎండనక, పగలనక సాగు చేస్తున్న తీరును చూపించింది. పిల్లలు, కుటుంబానికి దూరంగా బతుకుతున్న రైతన్నల దుస్థితిని తేటతెల్లం చేసిన ఈ షార్ట్ ఫిలిం విమర్శకులకు ప్రశంసలు అందుకుంది.. తండ్రి రాత్రి పూట కరెంట్ పెట్టడానికి వెళితే వాళ్ల కూతురు పడ్డ బాధకు పరిష్కారం దొరికింది.
రాత్రి వేళ మోటార్ ఆన్ చేయకుండానే మొబైల్ ద్వారా వ్యవసాయ మోటార్ ఆన్ చేసే టెక్నాలజీని ఇటీవల కనిపెట్టారు. ఆ యంత్రంతో మొబైల్ ఫోన్ ద్వారా మోటార్ ఆన్ చేయొచ్చు.. ఆఫ్ చేయొచ్చు.. దాన్ని తెలిపేందుకు రైతుల కష్టాలను తేటతెల్లం చేసేందుకు రూపొందించిన ఈ షార్ట్ ఫిలిం చూస్తే అందరి కళ్లు చమర్చక మానవు..