మీ ఫేస్-బుక్ ప్రొఫైల్ ను ఎవరెవరు చూసారో తెలుసుకోండి!!

ఈ రోజుల్లో ఫేస్ బుక్ వాడని వారు ఎవరుంటారు చెప్పండి..! చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ ఫేస్ బుక్ ను వాడె వారే..!! ఇక ఫేస్ బుక్ లో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఫ్రెండ్స్ లిస్టు గురించి. ఎంత ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటె… అంత ఫాలోయింగ్ ఉన్నట్టు ఫీల్ అవుతారు కొందరు. ఇలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటె అప్పుడప్పుడు సమస్యలు ఎదురవుతాయి.
ముఖ్యంగా అమ్మాయిలు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. బీరకాయ పీచు చుట్టరికంలా… ఫేస్ బుక్ ఫ్రెండ్స్ కూడా అలానే ఉంటారు. రోజు పదుల సంఖ్యలో కొత్త వ్యక్తుల నుండి ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తుంది. అసలు మన ప్రొఫైల్ ను ఎవరు చూస్తున్నారో… ఎవరెవరు మన వివరాలు సేకరిస్తున్నారో… తెలియని పరిస్థితుల్లో ఉంటాం. ఇలా మన ప్రొఫైల్ ను ఎవరెవరో చూసారో తెలుసుకోవాలంటే ఈ కింద ఇచ్చిన స్టెప్స్ ఫాలో అయితే చాలు!!
* మీ ఫేస్ బుక్ అకౌంట్ టైం లైన్ లోకి వెళ్ళండి.
* టైం లైన్ లో ఎక్కడైనా ఖాళి ఉన్న చోట రైట్-క్లిక్ కొట్టండి.
* అందులో వచ్చిన ఆప్షన్స్ లో వ్యూ పేజ్ సోర్స్ (View Page Source) సెలెక్ట్ చేయండి.
* వెంటనే కోడింగ్ ఉన్న పేజి ఓపెన్ అవుతుంది.
* ఇప్పుడు కంట్రోల్ + f నొక్కండి (find shortcut – Crtl+f).
* అక్కడ InitialChatFriendsList అని టైపు చేసి సెర్చ్ చేయండి.
* మీరు కొట్టిన ఈ InitialChatFriendsList అనే పదాలు హైలైట్ అవుతాయి.
* ఈ పదాల పక్కన మీకు నంబర్స్ కనిపిస్తాయి.
* ఒక్కో నెంబర్ ఒక్కో వ్యక్తికి సంభందించిన యునిక్ కోడ్ అన్నమాట.
* ఈ కోడ్ ను కాపీ చేసి www.facebook.com/ పక్కన పేస్టు చేసి ఎంటర్ కొట్టండి. ఉదాహరణ: www.facebook.com/10000855566XXXXXX అని టైపు చేసి ఎంటర్ నొక్కండి అంతే.
* మీ ప్రొఫైల్ ను ఎవరెవరు చూసారో ఇలా తెలుసుకోవచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *