
జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ లో నేడు మంత్రి ఈటెల రాజేందర్ తో సమావేశం ఏర్పాటు చేశారు. కరీంనగర్ కు వచ్చిన ఈ టెల ఈ సందర్భంగా స్థానిక ప్రతిమ మల్టిపెక్స్ లోని సమావేశ మందిరంలో జర్నలిస్టులతో సమావేశమవుతారు.
కాగా అక్రిడిటేషన్లలో అన్యాయానికి గురవుతున్న డెస్క్ జర్నలిస్టుల ఫోరం నాయకులు తమకు సైతం అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాల్లో భాగస్వామ్యం కల్పించి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఈ ఉదయం 11 గంటలకు జరిగే సమావేశానికి కరీంనగర్ కు పెద్ద ఎత్తున జర్నలిస్టులు తరలివస్తున్నారు.