
తెలంగాణ పౌర సరఫరాల శాఖమంత్రి ఈటెల రాజేందర్ సత్తా చూపించారు. తనకు తెలియకుండానే తన శాఖ పౌరసరఫరాల శాఖలో ఔట్ సోర్సింగ్ నియామకాలపై, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీపై విచారణకు ఆదేశించారు. పౌరసరఫరాల శాఖలో తనకు తెలియకుండానే ఏజెన్సీ నియామకం విషయంలో మంత్రికి తెలియకుండానే జరిగిన ఈ తంతుపై వార్తలు బయటకు రావడంతో మంత్రి ఈటెల సీరియస్ గా స్పందించారు. వెంటనే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ నియామకంను రద్దు చేసి విచారణకు ఆదేశించారు. బాధ్యులపై ఎంత పెద్ద అధికారులైనా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. వెంటనే ఏజెన్సీని రద్దు చేయాలని కూడా మంత్రి ఆదేశించారు. మంత్రి ఈటెల ధర్మాగ్రహంతో అధికారుల్లో వణుకు మొదలైందట.. ఈ విచారణ లో ఏం జరుగుతుందోనని భయం నెలకొందట..