ఈటెల కాన్వాయ్ లో ప్రమాదం

మంత్రి ఈ టెల రాజేందర్ కాన్వాయ్ లో ప్రమాదం చోటుచేసుకుంది.  కరీంనగర్ జిల్లా మెట్ పల్లి పట్టణంలో పర్యటిస్తున్న ఈ టెల కాన్వాయ్ లోని కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.  కరీంనగర్ నుంచి నిజామాబాద్ జిల్లా పోచంపాడులోని నీటిని ఎస్సారెస్పీ కెనాల్లో విడుద ల చేయడానికి మంత్రి ఈటెల విప్ కొప్పుల ఈశ్వర్ తో కలిసి వెళ్తుండగా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు ఇంటి వద్ద ఆగారు. అనంతరం ఆయనతో కలిసి బయలు దేరుతుండగా.. వాహనాలు వేగంగా ఒకదానికొకటి ఢీకొన్నాయి.  7 కార్లు ఈ ప్రమాదంలో ఢీకొన్నాయి.  మంత్రి, విప్ , ఎమ్మెల్యే కార్లకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

కాన్వాయ్ ప్రమాద దృశ్యాలను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *