Breaking News

ఈటెలకు వార్నింగ్.. కేసీఆర్ ఫైరింగ్

etela

నయీం ఎన్ కౌంటర్ సంఘటన లో కీలక పాత్ర పోషించింది మంత్రి ఈటెల రాజేందరే అని తేలింది. కరీంనగర్ కు చెందిన ఓ కాంట్రాక్టర్ ను 75 లక్షలు ఇవ్వాలని గ్యాంగ్ స్టర్ నయీం బెదిరించాడు. దీంతో ఆ కాంట్రాక్టర్ మంత్రి ఈటెల రాజేందర్ ను శరణు కోరాడు. దీనిపై సీరియస్ అయిన ఈటెల కాంట్రాక్టర్ కు అండగా భద్రత ఏర్పాటు చేయించి నయీంకు షాక్ ఇచ్చాడు. దీంతో సీరియస్ అయిన నయీం ఏకంగా మంత్రి ఈటెల రాజేందర్ నే బెదిరించాడట.. నిన్ను చంపేస్తానంటూ మండిపడ్డాడట..

దీంతో మంత్రి ఈటెల రాజేందర్ కేసీఆర్ ను కలిసి ఈ వ్యవహారాన్నంతా వివరించాడు. కేసీఆర్ పోలీసులకు హుకూం జారీ చేయడంతో నయీం కోసం నెలరోజులుగా పోలీసులు కాపు కాశారు.  ఎట్టకేలకు పోలీసుల చేతిలో నయీం ఎన్ కౌంటర్ అయ్యాడు. దందాలతో 10వేల కోట్లు సంపాదించిన నయీం అనవసరంగా అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలతో పెట్టుకొని మరణించడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *