ఎర్రబెల్లికి పక్కా పదవి..

నామినేటెడ్ పదవుల పందేరానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇటీవలే రామగుండం ఎమ్మెల్యే, బీసీ నేత సోమారపు సత్యనారాయణకు ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చిన కేసీఆర్.. అనక విభజన చట్టం ప్రకారం వేరు అయిన సంస్థలకు నామినేటెడ్ పదవుల ద్వారా భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు.

తన వద్ద చాలాకాలంగా రాజకీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేసీఆర్ రాజకీయా వ్యూహాలను అమలుచేస్తున్న సుభాష్ రెడ్డి కి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. రాష్ట్ర ఖనిజాభివృద్ది సంస్థ చైర్మన్ గా  ఆయనను నియమించాలని అధికారులను ఆదేశించారు. ఇదే కాకుండా పార్టీలోని ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సైతం పదవులు ఇచ్చేందుకు రెడీ అయ్యారు కేసీఆర్..

కాగా ఇటీవలే పార్టీలో చేరిన ఎర్రబెల్లి దయాకర్ రావుకు పదవి ఖాయంగా కనిపిస్తోంది. ఎర్రబెల్లికి నామినేటెడ్ పదవా.? లేక కేబినెట్ పునర్వ్యస్థీకరించి మంత్రి పదవా అన్నది తేలాల్సి ఉంది. కానీ ఈసారి ఎర్రబెల్లికి ఏదో పదవి ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *