గులాబీ దళం నుంచి ఫుల్ రెస్పాన్స్

టీడీపీలో వెలుగువెలిగిన ఒకప్పటి టీడీపీ శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన నియోజకవర్గంలో క్రేజ్ తగ్గలేదు. గులాబీ గూటికి చేరిన తర్వాత ఆయన ఎప్పుడైన తన సొంత నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో ఆయనకు ఘన స్వాగతం లభిస్తోంది. టీఆర్ఎస్ కార్యకర్తలు అడుగడుగునా ఆయనకు నీరాజనాలు పడుతున్నారు..

ఇటీవల పాలకుర్తి నియోజకవర్గంలో పలు అబివృద్ధి పనులకు వచ్చిన ఎర్రబెల్లిని జనం గుండెల్లో పెట్టుకున్నారు. కాగా కేసీఆర్ సైతం ఎర్రబెల్లికి దసరా తర్వాత ఒక కీలక పదవి ఇచ్చేందుకు రెడీ అయ్యారట.. మంత్రి పదవా..? లేక కార్పొరేషన్ పదవా అనేది తేలనుంది.. జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లాల సంఖ్య పెరగనుంది. ఆ నేపథ్యంలో జిల్లాకు ఒక మంత్రి పదవి చొప్పున దయాకర్ రావు కూడా మంత్రి పదవి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *