ఆదర్శ పాఠశాలల్లో ప్రవేశాలకు ప్రకటన

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 192 ఆదర్శ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి వరకు ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ ప్రకటన జారీ చేసింది. ఆరో తరగతిలో ఒక్కో పాఠశాలలో 100 సీట్లు అందుబాటులో ఉంటాయి. మిగతా తరగతుల్లో ఖాళీలు ఎన్నన్నది తర్వాత ప్రకటిస్తారు. దరఖాస్తులను ఈనెల 16వ తేదీ నుంచి పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇదీ షెడ్యూల్..
* జనవరి 17-31 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించొచ్చు.
* ఫిబ్రవరి 20-26 వరకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఫిబ్రవరి 26 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష.
* మార్చి 9న మెరిట్ జాబితా.
* మార్చి 10న ప్రవేశాలు పొందిన తది జాబితా వెల్లడి.
* మార్చి 17, 18 తేదీల్లో విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలన, ప్రవేశాలు.
* మార్చిలో తరగతులు ప్రారంభమవుతాయి. తేదీని తర్వాత ప్రకటిస్తారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *