
తెలంగాణ ఎంసెట్ లో అక్రమాలు.. ఎంసెట్ 2 రద్దు చేయవద్దని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ టీడీపీ నాయకులతో పాటు ఎంసెట్ 2 విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు.. కరీంనగర్ ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ నాయకులు ఈరోజు రాస్తారోకో చేశారు. ఎంసెట్ ను రద్దు చేయకుండా కాపీ చేసిన దుండగులను అరెస్ట్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.