Breaking News

ఎంసెట్ 2 రద్దు.. ఎంసెట్ 3 కు ప్రభుత్వం రెడీ

dc-Cover-qlss1v29t0v0taorj2is2kjgb6-20160423033103.Medi

ఎంసెట్ 2 రద్దు అయ్యింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించి ఈ మేరకు ఎంసెట్ 2 ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఎంసెట్ 2 లీకేజీ నేపథ్యంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఎంసెట్ 3కి వెళుతున్నట్టు తెలిపారు. లక్షల మంది విద్యార్థులకు దీని వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని.. కానీ సహృదయంతో అర్థం చేసుకోవాలన్నారు.
కాగా ఎంసెట్ నిర్వహణను జేఎన్టీయూహెచ్ కే అప్పగించారు. కానీ ఎంసెట్ 3కి కొత్త కన్వీనర్, కో కన్వీనర్లను, ఇతర సభ్యులను నియమించాలని కేసీఆర్ ఆదేశించారు. పాత హాల్ టికెట్లతోనే విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని.. మరో సారి డౌన్ లోడ్ చేసుకునే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. ఎంసెట్ విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని సూచించారు. విద్యాసంవత్సరం నష్టపోకుండా వేగంగా నిర్వహించాలని సూచించారు. ఎంసెట్ 2పై విచారణ అనంతరం ఎంసెట్ 3 షెడ్యూల్ విడుదల చేస్తామని ప్రకటించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *