Breaking News

జియో సిమ్ ల కోసం ఎగబడుతున్నారు..

db-mall_1472050866

భారతదేశంలోనే అతిపెద్ద కంపెనీ, పెద్ద పారిశ్రామికవేత్త అయిన ముఖేష్ అంబానీ నేతృత్వంలో వస్తున్న రిలయన్స్ జియో టెలిఫోన్ నెట్ వర్క్ కు డిమాండ్ పెరిగిపోతోంది.. ఈ కంపెనీ తొలి మూడు నెలలు కాల్స్, డేటా ఇంటర్నెట్ ఫ్రీ అని ప్రకటించడంతో ఈ జియో సిమ్ లకోసం ఇప్పుడు అన్ని నగరాల్లోని రిలయన్స్ స్టోర్స్ సెంటర్ల వద్ద జనం ఎగబడుతున్నారు. రోడ్ల మీదకు క్యూలో భారీగా నిలబడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నగరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.
జియో సిమ్ తీసుకుంటే తొలి మూడు నెలలు అపరిమిత ఫోన్ కాల్స్, ఇంటర్నెట్ ను కంపెనీ తొలుత ఉద్యోగులకు, ఆ పై కస్టమర్లకు అందిస్తోంది. వచ్చే డిసెంబర్ లో విడుదల కానున్న ఈ రిలయన్స్ జియో ఫోన్లు, సిమ్ లకోసం జనం ఇప్పటినుంచే ఎగబడుతుండడం గమనార్హం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *