అందుకే ఈనాడు నంబర్ 1గా కొనసాగుతోంది..

  • ఆదిలాబాద్ లో ఈనాడు ఎడిషన్ ప్రారంభం

కొన్ని నెలల క్రితం ఈనాడు ఎడిషన్లను తగ్గించేస్తోంది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. రామోజీ ఫిలింసిటీలో అతిపెద్ద కార్యాలయాన్ని ప్రారంబించి అందులోకి సోమాజిగూడలో ని ఈనాడు పత్రికా కార్యాలయాన్ని తరలించింది. ఇక్కడే ఈటీవీ తెలంగాణ, ఏపీ చానాళ్లను కూడా నిర్వహిస్తోంది. కొత్తగా అతి పెద్ద విస్తీర్ణంలో నిర్మించిన ఈ కార్యాలయం గడిచిన 9 నెలల క్రితం రామోజీరావు ప్రారంభించారు. అనంతరం ఈనాడు పెద్దలు ఓ ఆలోచన చేశారు. తెలంగాణ ఏపీలోని ఎడిషన్లను ఎత్తివేసి ఇలా అన్నింటిని ఒకేచోట నిర్వహించాలని ఆలోచించారు. ప్లాన్ కూడా చేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలన్నింటిని కరీంనగర్ లో ఏర్పాటు చేయాలని దక్షిణ తెలంగాణ ఎడిషన్లను హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ కార్యాలయానికి తరలించాలని ప్లాన్ చేశారు. కానీ ఎందుకో కొద్దిగా ఆలస్యం అయ్యింది. ఆ ఆలస్యమే ఈనాడుకు వరమైంది. ఎందుకంటే..

ఈనాడు ప్లాన్ బయటకు పొక్కడంతో సాక్షి యాజమాన్యం అలెర్ట్ అయ్యింది. ఖర్చులు తగ్గించుకునేందుకు తమకు ఈ ప్లాన్ వర్కవుట్ అవుతుందని స్కెచ్ గీసి .. అదే ప్లాన్ ను అమలు చేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాల ఎడిషన్లను వరంగల్ కు, దక్షిణ తెలంగాణ ఎడిషన్లను హైదరాబాద్ కు తరలించింది. దీంతో జిల్లాలు వదిలిరాని సీనియర్ జర్నలిస్టులందరూ సాక్షికి గుడ్ బై చెప్పి బయటకు వెళ్లిపోయారు. క్రమంగా సాక్షి సర్క్యూలేషన్ దారుణంగా పడిపోయి మనుగడ కష్టంగా మారడంతో తప్పు తెలుసుకున్న సాక్షి ఇక మళ్లీ జిల్లాల ఎడిషన్లను పునరుద్ధరించి బతుకు జీవుడా అని ఊపిరిపీల్చుకుంది. కానీ విలువైన మ్యాన్ పవర్ ను మాత్రం సాక్షి కోల్పోయింది. అంతేకాదు జర్నలిస్టులకు ఉద్యోగ భద్రత విషయంలో విశ్వసనీయతను సైతం కోల్పోయింది.

ఈ పరిణామాలన్నీ గమనిస్తూ వచ్చిన ఈనాడు.. తమ ప్లాన్ ను విరమించుకుంది. ఎక్కువ సర్య్కూలేషన్ తో నంబర్ 1లో ఉన్న ఈనాడు ఇలాంటి ప్రయోగాలు చేస్తే సాక్షికి పట్టిన గతే పడుతుందని.. నిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకొని అవే జిల్లాల ఎడిషన్లను కంటిన్యూ చేస్తోంది. అంతేకాదు.. ఈ ప్లాన్ బెడిసికొట్టడంతో ఇక జిల్లాల ఎడిషన్ల ఎత్తివేత ఐడియానే విరమించుకుంది. ఇప్పుడు ఏకంగా ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఎడిషన్ ప్రారంభించింది. ప్రస్తుతానికి ప్రింటింగ్ కేంద్రమే అయినా మంచిర్యాల జిల్లా అయితే ఇక్కడకు సబ్ ఎడిటర్లు మిగతా విభాగాలను సైతం తరలించి ఆదిలాబాద్ లో ఎడిషన్ రన్ చేయాలని యోచిస్తున్నారు.. కరీంనగర్ నుంచి ధూరభారం వల్ల ఆదిలాబాద్ కు పేపర్ వెళ్లడం ఆలస్యమవుతుండడంతో ఈనాడు ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తానికి అన్ని పత్రికలు కుదింపులకు దిగుతున్న వేళ ఈనాడు ధైర్యంగా మరో ఎడిషన్ ప్రారంభించడంతో మిగతా పత్రికలు కూడా ప్రారంభించక తప్పని పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  కొ త్త ఎడిషన్ల  విషయంలో నమస్తే తెలంగాణ ముందుందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *