ఈనాడు, జ్యోతి తొక్కేశాయి.. సాక్షి చింపేసింది..

తెలుగు నేల పై రాజకీయాలు, పత్రికలు వేరు కాదు.. ఒకదానికొకటి దగ్గరి సంబంధాలున్నాయి. నాడు ఎన్టీఆర్ హయాం నుంచి కూడా పత్రికలే తెలుగు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఆయా రాజకీయ పక్షాలకు దోహదపడ్డాయనడంలో  సందేహం లేదు.. ఆయా రాజకీయ పక్షాలకు ఆయుధాలుగా పత్రికలు మారాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు టీడీపీకి అండగా నిలబడితే.. ఇప్పుడు కాంగ్రెస్ తూరుపు ముక్కగా వైఎస్ చేతిలో బ్రహ్మాస్త్రంగా సాక్షి వచ్చింది.. ఆ తదనంతరం వైసీపీ స్థాపించిన జగన్ కు అండగా నిలిచింది..

మీడియా మేనేజ్ మెంట్ లో నాడు ఎన్టీఆర్, నేడు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబులదీ కీరోల్.. వారికి తెలిసినట్టుగా ఎవ్వరికీ తెలియదు.. అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబుకు రెండు కళ్లుగా ఉన్నాయి. అందుకే చంద్రబాబు వ్యతిరేక వార్తలకు వాటిల్లో చోటు లేదు. ఏపీలోనైతే మొత్తం ఏకపక్షమే.. తెలంగాణలో కొంత అటూ ఇటూగా ఉన్నాయి.

ఈరోజు ఎంత పెద్ద వార్త అయిన ఓటు కు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని షేక్ చేసిన ఓటుకు నోటు కుంభకోణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ వలపన్ని ఏపీ సీఎం చంద్రబాబును పట్టించాడు. చంద్రబాబు ఈ వ్యవహారంలో  అడ్డంగా దొరికిపోయి సంచలనం రేపింది. ఇంత పెద్ద ఫాలో అప్ వార్త ఈరోజు జరిగింది. అదే ఓటుకు నోటులో చంద్రబాబు పాత్ర ఉందంటూ వైసీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటీషన్ వేస్తే కోర్టు విచారణను సెప్టెంబర్ 29లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. దీంతో మరోసారి సీఎం చంద్రబాబు మెడకు ఈ ఉచ్చుపడింది. చార్జిషీట్ లో చంద్రబాబును పెడితే అరెస్ట్ ఖాయం. ఆయన సీఎం పదవి పోవడం ఖాయం.. కానీ ఈ వార్తను దారుణంగా తొక్కేశాయి చంద్రబాబు అనుకూల మీడియా.. ఇక ప్రతిపక్ష జగన్ సాక్షి పత్రిక మాత్రం ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. ఈరోజు ఏపీ లో పతాక శీర్షికన ప్రచురించి చంద్రబాబు కు షాక్ ఇఛ్చింది..

జర్నలిజంలో ఒకటే బ్యానర్ ఉంటుంది. ఆ రాష్ట్రంలో ఏది ముఖ్య సంఘటనో అదే ఇవ్వాలి..  ఇండియా ప్రపంచకప్ గెలిస్తే అందరూ అదే ఇస్తారు..కానీ చంద్రబాబు జైలు కెళ్లే వార్తను మాత్రం ఈనాడు, ఆంధ్రజ్యోతి తొక్కేయగా.. సాక్షి ఏకిపారేసింది.. ఈపాటి జర్నలిజం చూసి 5 రూపాయలకు కొని పేపర్ కొన్న పాత్రికేయుడు ఆయోమయానికి గురికాక తప్పని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఒక్కో పత్రికలో ఒక్కో బ్యానర్ ఉంది. ఇదీ మన తెలుగు పత్రికలు వాటి ని నడిపించే రాజకీయ అనుకూలుర దమననీతి..

44

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *