డ్రై ఫూట్స్ తో ఎన్ని లాభాలో తెలుసా..

డ్రైఫ్పట్స్ లో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. జీడిపప్పు, పిస్తా, డేట్స్, ఎండు ద్రాక్ష, వంటివి కొన్నిశతాబ్దాల కాలం నుండి మన వంట గదిలో ఉపయోగిస్తున్నారు.
వంటల్లో మాత్రం ఉపయోగించడానికి మాత్రమే కాదు, వాటిని ఎక్కువ రోజులు నిల్వచేసుకునే వారు . ఇవి చాలా రుచికరంగా ఉంటాయి.అందుకోసమే డ్రై ఫ్రూట్స్ లో వివిధ రకాలున్నాయి. వీటిని మనం డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు.

కొన్ని శతాబ్దాల కాలం నుండి డ్రై ఫ్రూట్స్ ను డైలీ డైట్ లో ఎందుకు చేర్చుకునే వారు, ప్రతి ఒక్క ఇంట్లో ఒక తప్పనిసరి నిత్యవసర వస్తువుగా దీన్ని ఎందుకు ఉపయోగించే వారో తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్ వెరైటీ ఫ్లేవర్స్ , వెరైటీ టీస్ట్ , అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉండటం వల్ల వీటిని డైలీడైట్ లో చేర్చుకుంటున్నారు. డ్రై ఫ్రూట్స్ లో నేచురల్ షుగర్స్ , హెల్తీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్స్, ఇతర న్యూట్రీషియన్స్ , మినిరల్స్ ఉండటం వల్ల ఆరోగ్య పరంగా గొప్ప ప్రయోజనాలను అందివ్వడం వల్ల దీన్ని శతాబ్దాల కాలం నుండి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
అయితే , మీకు ఏదైనా అనారోగ్య సమస్య ఉన్నప్పుడు, లేదా గతంలో వీటిని తిన్నప్పుడు అలర్జీ వంటి సమస్యలు ఎదురైఉన్నట్లైతే డాక్టర్ ను సంప్రదించి, తర్వాత తీసుకోవాలి. డైలీ డైట్ లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల పొందే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం..

కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది డ్రై ఫ్రూట్స్ లో ముఖ్యంగా బాదం వంటివి తీసుకోవడం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది . దీన్నే ఎల్ డిఎల్ అని పిలుస్తారు. వీటిని రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను నార్మల్ గా, స్థిరంగా ఉంచుకోవచ్చు. అనీమియా దూరం చేస్తుంది డేట్స్(ఖర్జూరం) లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇంకా కొద్దిగా మినిరల్స్, న్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉండటం వల్ల అనీమియాను దూరం చేస్తుంది.అనీమియా అనేది కామన్ డిజార్డర్. డ్రైఫ్రూట్స్ ను రోజూ తినడం వల్ల ఎర్ర రక్తకణాలు ఎక్కువగా ఏర్పడి, రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచడం వల్ల అనీమియా సమస్యను నివారించుకోవచ్చు.     బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేస్తుంది కొన్ని రకాల డ్రైఫ్రూట్స్ లో ఫైబర్, విటమిన్స్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. ఇన్నీ బ్లడ్ షుగర్ లెవల్స్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతాయి. ముఖ్యంగా వాల్ నట్స్, చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది మీరు తరచూ జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లైతే, రెగ్యులర్ డైట్ లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ లో మలబద్దకం, కడుపుబ్బరం, అజీర్థి వంటి జీర్ణ సమస్యలతో పోరాడే ఎఫెక్టివ్ గుణాలున్నాయి హార్ట్ హెల్తీగా డైలీ డైట్ లో డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల కార్డియో వాస్క్కులర్ ఆరోగ్యానికి అనుకూలంగా సహాయపడుతాయి. ఎందుకంటే చాలా వరకూ వీటిలో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఎసెన్సియల్ న్యూట్రీషియన్స్, మినిరల్స్ హార్ట్ హెల్త్ కు చాల గొప్పగా సహాయపడతాయి. అవయవాలను ఆరోగ్యంగా ఉంచుతాయి రెగ్యులర్ గా డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్, మినిరల్స్, విటమిన్స్ అందుతాయి. వీటి వల్ల శరీరంలో అవయవాలు ఆరోగ్యంగా ఉంటాయి. బరువు తగ్గిస్తాయి చాలా రకాల డ్రై ఫ్రూట్స్ లో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. ఇవి బరువు తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా గుప్పెడు డ్రైఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తింటుంటే, ఎనర్జీ పెరుగుతుంది. పొట్ట నిండిన అనుభూతి కలుగుతుంది. ఇతర ఆహారాలు ఎక్కువగా తీసుకోకుండా ఆకలి తగ్గిస్తుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *