ఔషధముగా శొంఠి 

 ఎండ పెట్టిన అల్లంను శొంఠి అంటారు. పచ్చి శొంఠిని పొడి చేసి కొన్ని వంటలలో వాడుతారు. నేతిలో వేయించి పొడి చేసిన శొంఠిని ఒక మందుగా ఉపయోగిస్తారు.
మొదటి ముద్దగా అన్నంలో శొంఠిని పలుచగా కలిపి నేతితో తింటే, అజీర్తి పోతుందని నమ్మకం
బాలింతరాలుకు శరీరము గట్టి పడేందుకు, వేడి కలిగేందుకు శొంఠిని విస్తృతంగా వాడుతారు.
పసి పిల్లలకు అజీర్ణం తగ్గేందుకు చాలా తక్కువ మోతాదులో దీనిని వాడుతారు. ఆయుర్వేద మందులలో ఇది ఎక్కువ కనిపిస్తుంది.
ఇది ఆకలిని పెంచుతుంది.జీర్ణ రసాలు ఊరడాన్ని ప్రేరేపిస్తుంది. ఆకలి తక్కువగా ఉన్నవారు చిన్న అల్లం ముక్కకు ఉప్పు అద్ది దాన్ని నమిలితే ఆకలి పుడుతుంది.
అల్లం ప్రయాణంలో ఉన్నపుడు కలిగే వికారాన్ని తగ్గిస్తుంది.
కొన్ని వేల సంవత్సరాలనుండి అల్లంను జలుబు మరియు ఫ్లూ చికిత్స కోసము వాడుతున్నారు.
అల్లం టీ తగడము వలన అజీర్తి తగ్గుతుంది.
అల్లం పొడి అండాశయ క్యాన్సర్ కణాల్లో కణ మరణాన్ని ప్రేరేపిస్తుంది.
అల్లం తినడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
మిన్నెసోటా విశ్వవిద్యాలయం అధ్యయనం ప్రకారం అల్లం కొలరెక్టల్ క్యాన్సర్ కణాలు వృద్ధిని తగ్గిస్తుంది. అందువలన ఇది పెద్దప్రేగు క్యాన్సర్ నివారణలో సహాయపడుతుంది.
గర్భిణీ స్త్రీలలో తలతిరుగడం, వికారము మరియు వాంతులు ఎక్కువగా ఉంటాయి. అల్లం తినడము వలన బాగా ఉపశమనం కలుగుతుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *