తాగి వాహనం నడిపారో అంతే సంగతులు..

తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వారిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపనున్నారు. తాగి నడుపుతూ పట్టుబడిన వారికి జరిమానా, శిక్షలతో పాటు కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇవ్వనున్నారు. కాగా విద్యార్థులు పట్టుబడితే విద్యాసంస్థలకు, ఉద్యోగులకు అయితే వారు పనిచేసే సంస్థలకు సమాచారం అందిస్తారు. అంతేగాక ఆ సమాచారాన్ని పాస్ పోర్టులు, వీసాలను జారీ చేసే కేంద్రాలకు, పలు దేశాల ఎంబసీలకూ సమాచారాన్ని పంపుతారు. దీంతో వారికి విదేశీ అవకాశాలు, ఉన్నత విద్యావకాశాలు దెబ్బతింటాయి. అలాగే వివాహం అయిన వ్యక్తి పట్టుబడితే అతని భార్యను, భార్య పట్టుబడితే భర్తను పోలీస్ స్టేషనుకు, అవివాహితులు పట్టుబడితే వారి తల్లిదండ్రులను కౌన్సెలింగ్ కు పిలవాలని, మైనర్లు పట్టుబడితే.. వారి పేరెంట్స్, మద్యం అమ్మిన వైన్ షాపు లేదా బార్ యాజమాన్యం కుడా కౌన్సెలింగ్ కు హాజరు కావాల్సి వుంటుంది.

ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారి సమాచారాన్ని ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చూసే.. టీఎస్ పీఎస్సీ, ప్రైవేటు ఉద్యోగ నియామక సంస్థలకు.. వీరు తాగుబోతులని ముందు గానే చెప్పేస్తారు. ఈ నిబంధనలన్నీ వారం రోజుల్లో అమల్లోకి తీసుకువస్తామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.ఈ నెల 1వ తేదీన పంజాగుట్టలో తీవ్ర ప్రమాదం జరిగి ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించిన ఘటన నేపథ్యంలో సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి తాగి వాహనాలు నడిపే వారికి అడ్డుకట్ట వేయాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *