ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందో తెలుసా?

ఇండియాలో ఆదివారం సెలవు రోజు అనే విషయం అందరికి తెలిసిందే! కానీ ఈ సెలవు ఎలా వచ్చిందో అందరికీ తెలియకపోవచ్చు. అయితే దీనికో చిన్న కథ ఉంది. ఈ ఆదివారం సెలవు అనేది నారాయణ మేఘాజీ లోఖండే అనే మహానుభావుడి పుణ్యం. ఆమహా పురుషుడు బ్రిటిష్ వారితో పోరాడితే మనకు ఆదివారం సెలవు రోజుగా ప్రకటించారని అంటారు. ఆ పోరాటం కూడా ఒకవారమో, ఒక నెలోకాదు, ఏకంగా 8 ఏళ్లు పోరాటం చేసాడు. నారాయణ మేఘాజీ జ్యోతిరావు పూలే గారి సత్యశోధన ఉద్యమంలో కార్యకర్త మాత్రమే కాకుండా కార్మిక నాయకుడు కూడా. బ్రిటిష్ వారి హయాంలో వారానికి 7 రోజులూ పనిచేసే వారు. నారాయణ మేఘాజీ వారం రోజులూ మన కుటుంబం కోసమే కష్టపడుతున్నామే గానీ ఏ సమాజం వలన మనకు నౌకరీ దొరికిందో ఆ సమాజ సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఒకరోజు కావాలని అందుకు ఒకరోజు సెలవు కావాలనే ప్రస్తావన 1881లో బ్రిటీష్ ప్రభుత్వం ముందు ఉంచాడు. అయితే బ్రిటీష్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఈ క్రమంలో నారాయణ మేఘాజీ ఉద్యమం మొదలు పెడితే అది తీవ్ర రూపం దాల్చి ఆఖరికి బ్రిటీష్ ప్రభుత్వం దిగివచ్చి 1889లో ఆదివారం సెలవు ప్రకటించింది. సెలవు అయితే వచ్చింది కానీ మేఘాజీ ఆశయం నెరవేరలేదు. ఏ కొద్దిమందో తప్ప సామాజిక సమస్యలపై దృష్టి పెట్టడం లేదు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *