డీకే అరుణకు భలే చాన్స్

dk-aruna647x450

గద్వాల పైర్ బ్రాండ్ ఎమ్మెల్యే డీకే అరుణ కు భలే చాన్స్ వచ్చింది. రోజురోజుకు సీనియర్ నేత జానారెడ్డి అసమర్ధ పాలనతో కాంగ్రెస్ కుదేలవుతోందని ప్రచారం నేపథ్యంలో ఆయనకు స్వస్తి పలికి అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ధీటుగా సమాధానమిచ్చేందుకు  శాసనసభాపక్ష నేతగా డీకే అరుణను ఎన్నుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చినప్పుడు నిర్ణయించినట్టు సమాచారం. జానారెడ్డి పై విమర్శలు రావడంతో ఆయన వైదొలుగుతానని ప్రకటించిన సంగతి తెలిసిందే.. జానారెడ్డి స్థానంలో డీకే అరుణను శాసనసభాపక్ష నేతగా చేయడానికి దిగ్విజయ్ సింగ్ నిర్ణయించినట్టు సమాచారం.కాంగ్రెస్ లో రోజురోజుకు వలసలు పెరిగిపోతుండడం పీసీసీ చీఫ్ ఉత్తమ్, శాసనసభాపక్షనేత జానారెడ్డిపై అందరూ విమర్శలు గుప్పిస్తుండడంతో ఆయనను మార్చాలని దిగ్విజయ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
ఇటీవల సమావేశంలో పాల్వాయి గోవర్దన్ రెడ్డి జానారెడ్డి తీరును విమర్శిస్తూ అసెంబ్లీలో గట్టిగా పోరాడుతున్న డీకే అరుణను సీఎల్పీ నేతగా చేయాలని దిగ్విజయ్ ను కోరారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ కూడా డీకే అరుణను సీఎల్పీ లీడర్ గా చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *