
హైదరాబాద్ లోని కేర్ ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న రమ్యతో దర్శకుడు క్రిష్ నిశ్చితార్థం , సన్నిహితులు, బంధువుల సమక్షంలో సంబరంగా జరిగింది.. క్రిష్ ప్రస్తుతం బాలక్రిష్ణ వందోచిత్రం ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ని దర్శకత్వం వహిస్తున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తూనే ఇంట్లోని కుటుంబ సభ్యుల కోరిక మేరకు తన నిశ్చితార్థ వేడుకను జరుపుకున్నారు.
కాగా క్రిష్ నిశ్చితార్థానికి బాలక్రిష్ణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ఆశీర్వదించారు. కాగా గౌతమి పుత్ర సినిమా పూర్తి చేశాకే క్రిష్ పెళ్లి జరగనుంది. ఇప్పుటు షూటింగ్ బిజీలో హడావుడిగా ఉన్న కూడా క్రిష్ నిశ్చితార్థం చేసుకొని పెళ్లిని సినిమా తర్వాతే చేసుకోనున్నాడు..