దటీజ్.. కేటీఆర్

ktr

-లింగంపల్లి నాలా ఆక్రమణపై స్పందించిన మంత్రి
-చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ ద్వారా బల్దియాకు ఆదేశం
-వెంటనే నిర్మాణాన్ని కూల్చివేసిన సిబ్బంది
-అభినందిస్తూ ట్విట్టర్‌లో పలు పోస్ట్‌లు

 హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలోని లింగంపల్లి నాలాపై వెలిసిన అక్రమ నిర్మాణాన్ని శనివారం బల్దియా అధికారులు కూల్చేశారు. శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకుడు నాలాలో మట్టిని నింపి అక్రమంగా షెడ్డు నిర్మించడంపై నమస్తే తెలంగాణ దినపత్రికలో నాలాను పూడ్చాడు… నిర్మాణం చేపట్టాడు శీర్షికన శనివారం కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనంపై మున్సిపల్, ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా స్పందించారు. తన ట్విట్టర్‌లో నమస్తే కథనానికి సంబంధించిన లింక్‌ను పోస్టు చేస్తూ.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించారు.

దీంతో బల్దియా కమిషనర్ జనార్దన్‌రెడ్డి అక్రమ నిర్మాణం కూల్చివేతపై సర్కిల్ 12 ఉపకమిషనర్ మమతను ఆదేశించగా టౌన్ ప్లానింగ్ ఏసీపీ మహిపాల్‌రెడ్డి నేతృత్వంలో రంగంలోకి దిగిన సిబ్బంది సదరు నిర్మాణాన్ని కూల్చివేశారు. అనంతరం చర్యలు తీసుకున్న అంశాన్ని, కూల్చివేత ఫొటోలతో సహా మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో జీహెచ్‌ఎంసీ పోస్టు చేసింది. దీనికి బదులుగా మంత్రి కేటీఆర్, జీహెచ్‌ఎంసీలను అభినందిస్తూ ట్విట్టర్‌లో పలు పోస్ట్‌లు వచ్చాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *