Breaking News

జర్నలిస్టుల ధర్నాలో దద్దరిల్లిన ఒగ్గుడోలు డప్పు చప్పుళ్లు

dharubu

కరీంనగర్ : కరీంనగర్ లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే ధర్నాలో జర్నలిస్టులు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించాలని నినదించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ వద్ద ధర్నా, వంటావార్పు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే  మృత్యుంజయం ధర్నాలో పాల్గొని జర్నలిస్టుల పార్టీ తరఫున సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా ధర్నాలో ఒగ్గుడోలు కళాకారులు ప్రదర్శించిన డప్పు చప్పుళ్లు అలరించాయి. ధర్నా వేదికపై అందరూ కళాకారులు డప్పులతో గీతాలపనలు చేసి ప్రభుత్వం జర్నలిస్టు ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఈ ధర్నాలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాడూరి కరుణాకర్, గాండ్ల శ్రీనివాస్, తెలంగాణ ఆన్ లైన్ మీడియా జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అయిలు రమేశ్ , భారీగా జర్నలిస్టులు పాల్గొన్నారు.

dharna

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *