Breaking News

బంగారు తెలంగాణలోనూ అదే అవినీతా..?

NEET-Rep-Reuters

తెలంగాణలో ఎంసెట్ 2 లీకేజీతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారింది.. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన దానిపై ప్రతిసారి దుమ్మెత్తి పోసే తెలంగాణ టీఆర్ఎస్ నాయకులు కూడా అదే ఒరవడితో అంతే అవినీతితో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని ఎంసెట్ 2 లీకేజీ ఉదంతం బయటపెట్టింది.. ఎంసెట్ 2 పేపర్ ప్రింటింగ్ నుంచి కరెక్షన్ వరకు అధికార పార్టీ నేత బంధువుకే కాంట్రాక్ట్ ఇప్పించి ఈ భారీ కుంభకోణంలో కోట్లు వెనకేసుకున్నారనే విషయం వెలుగుచూసింది..

ఎంసెట్-2 పేపర్ ప్రింట్ చేసిన కపాడియా ప్రింటింగ్ ప్రెస్ బ్లాక్ లిస్టులో ఉందటా…!? ఎంసెట్-2 పేపర్ కరెక్షన్ చేసిన మాగ్నెటిక్ సంస్థ కూడా బ్లాక్ లిస్టులో ఉందటా…!? అంతే కాదు ఈ సంస్థ రాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఒక రాజకీయ నాయకుడి బంధువుడిదేనటా…!? మాటి మాటికి బంగారు తెలంగాణ అని భుజాలు ఎగిరేసే మనం ఎంసెట్-2 పేపరు తయారీ మరియు కరెక్షన్ ను బ్లాక్ లిస్టులో ఉన్న కంపేనీలకు ఎందుకు అప్పగించినట్లు…!? దీనిపై లలోతున పరిశోధన చేస్తే ఇంకా భారీ అవినీతి నిజాలు బయటకొస్తాయి.. ఇదంతా ప్లాన్ ప్రకారం జరగడంతోనే ఎంసెట్ 2ను ప్రభుత్వం రద్దు చేసింది. లక్షల విద్యార్థుల జీవితాలతో ఆటలాడిన ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుంటే మంచిది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *