Breaking News

క్రికెట్లో అద్భుతం.. వరల్డ్ రికార్డు

123

ప్రపంచ క్రికెట్ పెను అద్భుతం చోటు చేసుకుంది. ఇప్పటివరకు ఉన్న రికార్డులన్నీ కొట్టుకుపోయాయి.  ప్రపంచ రికార్డు బద్దలయ్యింది. మంగళవారం పాకిస్తాన్ తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లాండ్ జట్టు పరుగుల వరద పారించింది.  ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పాకిస్తాన్ బౌలర్లను ఊచకోత కోశారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది.

ఇంతకు ముందు అత్యధిక స్కోరు రికార్డు 2006లో నెదర్లాండ్స్ జట్టుపై 443/9 నెలకొల్పిన రికార్డును ఇంగ్లాండ్ అధిగమించింది. ప్రపంచ క్రికెట్ లో ఇప్పుడు సాధించిన ఇంగ్లాండ్ జట్టుదే అత్యధిక స్కోరు . అలెక్స్ హేల్స్ 122 బంతుల్లోనే 171 పరుగులు చేసి ఇంగ్లాండ్ కు భారీ స్కోరునందించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *