Breaking News

మా నీళ్లు మాకేనంటూ కాంగ్రెస్  ధర్నా

huns1

కాంగ్రెస్ ధర్నాలతో హోరెత్తించింది. కరీంనగర్ జిల్లా రామగుండం -మంచిర్యాల సరిహద్దుల్లోని ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సిద్దిపేట, మెదక్ లకు నీరు తరలించుకుపోవడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో ఆందోళన బాట పట్టింది. ఎల్లంపల్లి నుంచి ముందు రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్ మండలాలకు తాగునీటిని అందించిన తర్వాతే సీఎం కేసీఆర్ మెదక్ కు, సిద్దిపేటకు, గజ్వేల్ కు నీటిని తరలించాలని కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు.

husnaba
శనివారం హుస్నాబాద్ లో కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డిలు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కరీంనగర్ కు నీళ్లిచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు తీసుకుపోవాలని డిమాండ్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *