పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ మహాధర్నా

ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లు రద్దు చేసి పేదలు, రైతులు, కార్మికులు, చిల్లర వర్తకులు, మధ్యతరగతి కుటుంబీకులు, అసంఘటిత రంగ ప్రజల పెను దాడి చేసినందుకు నిరసనగా కాంగ్రెస్ పోరుబాట పట్టింది.. 1శాతం నల్దధనం కలిగియున్న వారిని ఇబ్బందిపెట్టడానికి మోడీ 99శాతం ప్రజలను హింస కు గురిచేయడం దారుణమని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేశారు. ఇప్పటికీ జనం ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అలానే క్యూల్లో నిలబడ్డారని మండిపడ్డారు. అక్రమార్కుల నల్ల డబ్బు అంతా పేదలదేనని తేల్చిచెప్పారు.

17fbb26c-3c25-4c51-8128-43d390a016bd

ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి ఏఐసీసీ పరిశీలకులు సి. జయప్రకాశ్ సాజెడ్ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.. జిల్లా ఇన్ చార్జి నర్సింగరెడ్డి, సీఎల్పీ డిప్యూటీ లీడర్ , జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, పీసీసీ మహిళా విభాగం అధ్యక్షులు నేరేల్ల శారద, పీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆరేపెల్లి మోహన్, డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు సుద్దాల దేవయ్య, అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి, కొమిరెడ్డి రాములు, మాజీ జడ్పీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జడ్పీ ఫ్లోర్ లీడర్ నారాయణ రెడ్డి, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మీ,నాయకులు పాడి కౌశిక్ రెడ్డి, చల్మెడ లక్ష్మీ నర్సింహారావు, రమ్యరావు, ప్యాట రమేశ్, అకాల ప్రకాష్, గందె మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, ఉప్పర రవి, దిండిగాల మధు, ఒంటెల రత్నాకర్, చర్ల పద్మ, కొమిటిరెడ్డి నరేందర్ రెడ్డి, బొమ్మ శ్రీరాంచక్రవర్తి, కర్ర రాజశేఖర్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *