
పొలిటికల్ సర్కిల్స్ లో జోకులు కొదవ లేదు. మరీ ముఖ్యంగా మొద్దాబ్బాయిలపై జోకులు పేలుతూనే ఉంటాయి. హీరోల్లో బాలయ్య, ఆయన అల్లుడు, సీఎం చంద్రబాబు కొడుకు లోకేష్ లపై కామెడీ పటాసులు పేలుతూనే ఉంటాయి. సందర్భాన్ని బట్టి అవి మారుతూనే ఉంటాయి. ఇప్పుడు అంతే ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్లను రద్దు చేయడంతో దాన్ని బాలయ్య-లోకేష్ లపై కామెడీకి వాడేసుకున్నారు కొందరు ఔత్సాహికులు ఆ కామెడీ బిట్టు మీకోసం..
చంద్రబాబు: ఒరేయ్ …లోకాయ్… నీ దగ్గర ఐదు వందల నోట్లు చాలా ఉన్నాయి అన్నావ్… మార్చుకున్నవా అవి?
లోకేష్ : ఇందాకే అన్ని మార్చేసా డాడీ…!
బాబు : హమ్మయ్య… ఇంతకీ ఎవరికి అంటగట్టావ్?
లోకేష్ : ఎవరికో ఎందుకు ఇస్తాను డాడీ… బాలయ్య మాయ్య దగ్గిర వెయ్యి నోట్లు చాలా వున్నాయి అని అంటే… అవన్నీ తీసుకొని నా ఐదు వందల నోట్లన్నీ ఇచ్చేసా… మాయ్య కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు తెలుసా…
బాబు : వారి నీ అయ్య… అందుకు గాదూ మీ ఇద్దరి మీద రోజూ జోకులు వచ్చేది