చిట్టీ డబ్బులు ఇస్తారా.. చావాలా..

తన చిట్‌ డబ్బుల విషయంలో శ్రీరామ్‌ చిట్స్‌ యాజమాన్యం వైఖరికి నిరసనగా ఓ మహిళా హోంగార్డు శుక్రవారం కార్యాలయం బిల్డింగ్‌ ఎక్కి నిరసన వ్యక్తం చేసింది. ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌ పరిధి రాజీవ్‌ రహదారిని ఆనుకుని ఉన్న శ్రీరామ్‌ చిట్స్‌లో పెద్దపల్లికి చెందిన మహిళా హోంగార్డు మామిడి పద్మ తన చిట్‌ వేస్తోంది. దీనికి సంబంధించిన లావాదేవీలు సక్రమంగా లేవని యాజమాన్యాన్ని నిలదీసింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో బిల్డింగ్‌పైకి ఎక్కి నిరసన చేపట్టింది. విషయం తెలుసుకున్న రామగుండం సీఐ వాసుదేవారావు, ఎన్టీపీసీ ఎస్సై చంద్రర్‌కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకున్నారు. చిట్స్‌ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. పద్మతో మాట్లాడి కిందకు దించారు. నిరసనకు కారణాలు తెలుసుకున్నారు.
2015లో చిట్‌ వేసిన పద్మ తన చిట్‌ను ఆరు నెలల క్రితం లిఫ్ట్‌ చేసింది. ఈ మేరకు దానికి సంబంధించిన జమానత్‌ వ్యక్తుల పత్రాలను సైతం అందించినా తనకు డబ్బులు ఇవ్వలేదు. దీంతో వాటిని వారి దగ్గరనే డిపాజిట్‌ చేసింది. డిపాజిట్‌ చేసిన అనంతరం ప్రతీ నెల డబ్బులు చెల్లించాల్సి ఉండగా తను మూడు నెలలుగా చెల్లించక పోవడంతో చిట్స్‌ నిర్వాహకులు డిపాజిట్‌ క్యాన్సిల్‌ చేస్తున్నట్లు సమచారం ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన పద్మ ఆందోళనకు దిగింది. చిట్‌ కొనసాగిస్తామని యాజమాన్యం హామీ ఇవ్వడంతో, ఆమె బకాయి ఉన్న డబ్బులు చెల్లించింది. ఇరువర్గాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.

హోంగార్డు ఆందోళనను పైన వీడియోలో చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *