రైతు సమస్యలపై చిరు అస్త్రం

చిరంజీవి తన 150 వ చిత్రానికి రైతు సమస్యలపై కథనే ఎంచుకున్నాడు.  అన్నదాతల ఆత్మహత్యలు, వారి సమస్యలు పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వాటి పరిష్కారం ఒక వ్యక్తిగా చిరంజీవి ఏం చేశాడనే కథాంశాన్నే చిరు 150వ చిత్రం కథ.. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. అనంతరం హైదరాబాద్ పరిసరాల్లోని పరిసర గ్రామాల్లో షూటింగ్ నిర్వహిస్తారు.

తమిళం లో ఈ సినిమా కత్తి పేరుతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇక్కడ కత్తిలాంటోడు పేరుతో అనుకుంటున్నారు. కానీ చిత్ర నిర్మాత రాంచరణ్ మాత్రం ఈ చిత్రానికి పేరును ఇంకా డిసైడ్ చేయలేదు.. వివి వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది ఆఖరుకు రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *