ఖండాతరాలు దాటిన చిరు ఖ్యాతి

ఖైదీనంబర్ 150కి  ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఇదో పండగ వాతావరణాన్ని సృష్టిస్తోంది.. తాజాగా సౌదీలోని రియాద్ లోని ఓ కన్ స్ట్రక్షన్ కంపెనీ తమ తెలుగు ఉద్యోగులకు సెలవు ప్రకటించిందట.. నోటీస్ లో ఖైదీ నంబర్ 150 సినిమా కోసం తెలుగు ఉద్యోగులందరికీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నట్టు పేర్కొంది.. దీంతో కబాలితో రజినీ లాగేనే చిరు తన స్టామినాను మరోసారి నిరూపించుకున్నట్టు అయ్యింది.. భాషా తర్వాత రజినీ తీసిన ఫుల్ మాస్ ఎంటర్ టైనర్ కబాలీ.. ఈ చిత్రం విడుదలకు ముందు విపరీతమైన ప్రచారం జరిగింది. కొన్ని ఎయిర్ లైన్స్ సంస్థలు ఉచిత తాయిలాలు ప్రకటించాయి. విమానాలకు కబాలి సినిమా పోస్టర్ లు అంటించాయి..  రజినీ నటించిన కబాలి మూవీ విడుదల జూలై 22న అయితే చైన్నై, బెంగళూరులోని పలు కంపెనీలు , సౌదీ అరేబియా, గల్ఫ్ , మలేషియా, బ్యాంకాక్, సింగపూర్ లలో ఉద్యోగులకు సెలవులు ఇచ్చారంటే రజినీ మాయను అర్థం చేసుకోవచ్చు.. కబాలీ హిట్ ప్లాప్ అన్నది పక్కనపెడితే అగ్రహీరో రజినీ కాంత్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఆయా కంపెనీలు సెలవుల్ని మంజూరు చేశాయి.. ఇప్పుడు అదే తరహాలో చిరంజీవి 150 సినిమాకు సౌదీలోని రియాద్ కంపెనీ తన ఉద్యోగులకు సెలవులు ప్రకటించడం సినిమాకు పబ్లిసిటీ అయ్యింది.
రియాద్ లోని సదురు కంపెనీ ఉద్యోగి రియాద్ కంపెనీ ఇచ్చిన సెలవును.. నోటీసులో చిరు సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇలా రజినీ ఫామ్ ను అందిపుచ్చుకున్న తెలుగు హీరోగా చిరు విశేష ఆదరణ పొందుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *