
చిరంజీవి గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ కోదండరాం రెడ్డి.. చిరంజీవితో దాదాపు 27 పైగా సినిమాలు తీసిన కోదండ అన్నీ బ్లాక్ బస్టర్ మూవీలే ఇచ్చాడు. కొండవీటి దొంగ, అభిలాష, న్యాయం కావాలి,వేట, త్రినేత్రుడు, పసివాడి ప్రాణం, ఖైదీ లాంటి చిరు జీవితంలోనే అతిపెద్ద భారీ విజయాలన్నందించిన దర్శకుడు ఆయన.. 70 వ దశకంలో ఎఎన్నార్, ఎన్టీఆర్ లంటి వాళ్లే కోదండంరాంరెడ్డి సినిమాల కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి..
కానీ ప్రస్తుతం కాలం గిర్రున తిరిగింది. ఆయన రిటైర్ అయిపోయారు. ఈ మధ్య ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన పిచ్చపాటిగా చిరంజీవి గురించి అడిగిన ప్రశ్నలకు నిక్కచ్చిగా సమాధానమిచ్చారు. చిరంజీవి రాజకీయాల్లో ప్లాప్ అయ్యాడన్నారు. నిజానికి మాస్ హీరోగా కన్నా చిరు క్లాస్, కామెడీ బాగా పండించగలడని కోదండరాంరెడ్డి కితాబిచ్చాడు.. యాక్షన్, హీరోయిజం కంటే కామెడీ చిరు బాగా పండిస్తాడని చెప్పుకొచ్చారు.