చిరు 150 వ సినిమాకు విశేష ప్రేక్షకాదారణ

చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన తన 150 వ సినిమా ఈరోజు రిలీజ్ అవుతోంది… ఇసుక వేస్తే రాలనంత జనం సినిమా చూసేందుకు హాజరై చిరు కు గ్రాండ్ గా వెల్ కం చెప్పారు. అభిమాన సంద్రమే అక్కడ సాక్షాత్కారమైంది. తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఎంత మంది అయితే వచ్చారో అంతే స్థాయిలో ఎక్కడా తగ్గకుండా వచ్చి అన్నయ్యకు సలాంకొట్టారు.. ఈ సందర్భంగా చిరంజీవి ఆడియో వేడుకలో జరిగిన విశేషాలు..

* శత్రువైనా.. మిత్రుడైనా.. దాసరి సలహా స్వీకరించిన చిరు..
ఒకప్పుడు.. చిరంజీవి-దాసరి నారాయణ రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది.. పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరంజీవిని విమర్శించినందుకు దాసరిని మీడియా ముందుకొచ్చి మరీ కడిగిశాడు.. దాసరి నారాయణ రావు వ్యాఖ్యలను చిరు కూడా ఖండించారు.. కానీ కాలం మారింది. వారి మధ్య మునుపటి స్నేహం వెల్లివిరిసింది..
చిరంజీవి ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమాకు ఇతోదికంగా గొప్ప సాయం చేశారట దాసరి నారాయణ రావు.. ఇదే విషయాన్ని చిరు విజయవాడ హ్యాయ్ లాండ్ లో నిర్వహించిన ఆడియో వేడుకలో చెప్పారు . ఈ సందర్భంగా దాసరి కి కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి 150 వ చిత్రం ట్రైలర్ చూసిన దాసరి అందులో చిరు జైలులో ఖైదీ డ్రెస్సుపై 150 వ నంబర్ చూసి చిరంజీవికి ఫోన్ చేశాడట.. 150 వ సినిమా ట్రైలర్ బాగుందని.. దీనికి ఖైదీ నంబర్ 150 అని పేరు పెట్టాలని సూచించారట.. దీంతో బాగుందని అన్న చిరంజీవి వెంటనే డైరెక్టర్ వివి వినాయక్ తో చర్చించి సినిమాకు అదే టైటిల్ ఫిక్స్ చేశారట.. ఇలా ఎంత విభేదాలున్న చిరు దాసరి సలహాను స్వీకరించడం.. ప్రతిష్టాత్మక చిత్రానికి అదే టైటిల్ గా ఎంపిక చేయడం విశేషం..

* చిరంజీవి, పవన్, రాంచరణ్, అల్లు అర్జున్ లతో సుబ్బిరామిరెడ్డి సినిమా
మెగాస్టార్ వేదిక సాక్షిగా అనేక విషయాలు బయటపడ్డాయి.. చిరంజీవి ఆప్తులు, శ్రేయోభిలాషులు తమకు చిరంజీవిపై న్న అభిమానాన్ని చాటుకున్నారు.. వేదికకు వచ్చిన సుబ్బిరామిరెడ్డి, దాసరి నారాయణ రావులు.. చిరంజీవి స్టామినా తగ్గలేదని వ్యాఖ్యానించారు. 8 ఏళ్లు గ్యాప్ వచ్చినా ఖైదీ సినిమాలో ఎలా కసిగా చేశాడో ఇప్పుడూ అలా చేశాడని కొనియాడారు.. చాలా కష్టపడి పైకొచ్చిన చిరు ఇండస్ట్రీలోనే సొంత కాళ్లపై మెగా స్టార్ గా అవతరించాడని దాసరి కొనియాడారు.. ఇక సుబ్బిరామిరెడ్డి గారు అయితే రెచ్చిపోయారు..
మెగాస్టార్ ఒక్కడు కష్టపడి పైకి ఎదిగి ఫ్లాట్ ఫాం ఏర్పాటు చేశాడన్నారు. మెగాస్టార్ వల్ల ఆయన మెగా కుటుంబంలో మరో 8 మంది స్టార్ లు అవతరించారని సుబ్బిరామిరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. చిరుతో స్టేట్ రౌడీ సినిమాను 20 ఏళ్ల క్రితం చేశానని.. ఆ తర్వాత సినిమాలు తీయడం మానేశానని. . కానీ ‘ ఏళ్ల తర్వాత చిరు సినిమా రంగ ప్రవేశం చేసిన నేపథ్యంలో తాను మళ్లీ సినిమా తీస్తానని నిర్మాతగా మారుతానని సుబ్బిరామిరెడ్డి స్పష్టం చేశారు. అందులో చిరుతో పాటు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లు నటిస్తారని ఆశిస్తున్నారని సుబ్బిరామి రెడ్డి అన్నారు. ఇది సాధ్యమా కాదా తెలియదో కాను మెగా ఫ్యామిలీ మొత్తం నటిస్తే అది తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే పెద్ద చిత్రం అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు..

* చిరు ఫంక్షన్ లో ఆనందం పట్టలేకపోయిన అల్లు అర్జున్..
చిరంజీవి 150 వ చిత్రంలో వేదిక పై చిరు, రాంచరణ్ కంటే అత్యంత హుషారుగా కనిపించారు అల్లు అర్జున్.. చిరంజీవి మాట్లాడుతుంటే.. డైలాగ్స్ చెబుతుంటే అల్లు అర్జున్ కేరింతలు కొట్టారు. వినాయక్ ని జబ్బ చెరుస్తూ నవ్వుతూ ఉల్లాసంగా గడిపారు. చిరంజీవి ఇంద్ర డైలాగులు చెబుతుంటే అయితే అర్జున్ ఉబ్బితబ్బియ్యాడు.. మిగతా అందరూ హీరోలు రాంచరణ్, సుప్రీం హీరో, అల్లు శిరీష్ లు ఇలా అందరూ తమ హవాభావాలను కంట్రోల్ చేసుకున్న అల్లు అర్జున్ లో మాత్రం మావయ్య చేసే ప్రతి పనికి కేరింతలు కొట్టి తన హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం గమనార్హం.
ఇక చిరంజీవి ప్రత్యేకంగా 150 వ చిత్రానికి నిర్మాత గా వ్యవహరించిన రాంచరణ్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు.. ధ్రవ షూటింగ్ లో రాంచరణ్ బ్యాంకాక్ లో ఉన్నా యూగోస్లేవియాలో షూటింగ్ జరుపుకుంటున్న చిరంజీవి యూనిట్ సభ్యులకు 300 యూరోల చొప్పున ఇప్పించిన రాంచరణ్ గొప్ప నిర్మాతగా ఎదుగుతాడని కొనియాడారు.

* తండ్రితో, కొడుకుతో పంచుకున్న కాజోల్
ఇదో విచిత్రం.. అప్పట్లో శ్రీదేవి దిగ్గజ ఏఎన్నార్ తో పాటు అనంతరం ఆయన కుమారుడు నాగార్జునతో కూడా ఆడిపాడింది. నటనలో భాగంగానైనా ఇదో సంచలనమే అయ్యింది. కళామతల్లికి నటనకు సంబంధం లేదని ఎందరు చెప్పుకున్నా కూడా తండ్రితో ఆడి కొడుకుతో ఆడిన హీరోయిన్ చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయింది..
ఇప్పుడు అదే రిపీట్ అయ్యింది.. చిరంజీవి 150 సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. అంతకుముందు కాజల్ చిరు మేనల్లుడు అల్లు అర్జున్ తో పాటు కొడుకు రాంచరణ్ తో కలిసి నటించింది. అప్పట్లో తండ్రితో పాటు కొడుకుతో నటించిన హీరోయిన్లు ఉన్న ఈ ఇండస్ట్రీలో ట్రైన్ రివర్స్ అయ్యింది. ముందు కొడుకుతో ఆ తర్వాత తండ్రితో ఆడిపాడిన భామగా కాజల్ చరిత్రలో నిలిచిపోయింది.. ఈ విషయాన్ని చిరంజీవి తన 150 సినిమాలో ప్రత్యేకంగా ప్రస్తావించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *