దావత్.. ఆ నలుగురి ప్రాణాలు తీసింది..

aa
  • కరీంనగర్ జిల్లాలో ఘొర రోడ్డు ప్రమాదం. – నలుగురు యువకుల మృతి

సైదాపూర్ మండలం దుద్దెనపల్లి శివారులో బైక్ ను ఢీ కొట్టి బావిలో పడ్డ ట్రాక్టర్. ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురు యువకులు గల్లంతు. గల్లంతైన వారు చిగురుమామిడి మండలం బొమ్మనపల్లికి చెందిన కత్తుల శివ, పిల్లి సంతోష్ కుమార్, బొల్లి రాజు, కొంకట శ్రీకాంత్ గా గుర్తింపు. నలుగురు ట్రాక్టర్ తో సహా 20 మీటర్ల లోతులో గల వ్యవసాయ బావిలో పడ్డారు. వారిని పైకి తీసేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ట్రాక్టర్ ఢీ కొట్టడంతో బైక్ పై వెళ్తున్న పోలీస్ డిపార్ట్ మెంట్ కు చెందిన ఇద్దరికి తీవ్రగాయాలు కావడంతో వరంగల్ ఎంజిఎం కు తరలించారు.   కత్తుల శివ కొత్త ట్రాక్టర్ కొనుగోలు చేసి మిత్రులతో సైదాపూర్ లో దావత్ చేసుకుని స్వగ్రామానికి  బయలుదేరగా మార్గమద్యలో దుద్దెనపల్లి సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. రాత్రి చీకటికావడంతో  సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *