
చంద్రబాబు మరోసారి పట్టిసీమ ప్రాజెక్టులో పూజలు చేసి ప్రారంభించారు. ఇప్పటికే రెండుసార్లు ప్రాజెక్టును ప్రారంభించి కిందకు నీళ్లు విడుద లచేసిన చంద్రబాబు ముడోసారి సైతం నీళ్లను విడుదల చేసి తన తొట్టతొలి ప్రాజెక్టు సాధించానంటూ గర్వంగా చెప్పుకున్నాడు..
కాగా మోటార్లు ఆన్ చేయగానే కాలువలు ఇంకా పూర్తికాకపోవడంతో అధికారులు రెండు గంటలకే వాటిని బంద్ చేయాల్సిన పరి్స్థితి ఏర్పడింది. మీడియాలో మాత్రం కృష్ణ , గోదావరి నదులను కలిపిన అపర భగీరథుడు, అంటూ ఊదరగొట్టేస్తున్నారు. నిజానికి పట్టిసీమ లో ఇంకా కాలువల నిర్మాణం పూర్తి కాలేదు. పంపుహౌస్ నుంచి నీటిని తోడి కృష్ణలో కలిపేందుకు ప్రాజెక్టు పూర్తయినా లైనింగ్ కాలువలు లేక నీరు చివరకు కృష్ణా నదిలో చేరడం లేదు. దీంతో ప్రచారం కోసం మాత్రమే బాబు పాకులాడుతూ పట్టిసీమాపై హంగామా చేస్తున్నారు..