చంద్రబాబుకు కేటీఆర్ మళ్లీ వేశాడు..

సెటైర్ వేస్తే సూది కూడా సమ్మగా దిగాలి.. అనే ఒక స్లోగన్ ఉంది. ఇప్పుడు అదే పద్ధతిని అవలంభించారు తెలంగాణ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా సాక్షిగా చంద్రబాబు ఆనందాన్ని నీరుగార్చాడు.. జూన్ 1 నుంచి ప్రారంభమైన ఏపీ నూతన రాజధాని అమరావతి పరిపాలన సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు… ‘ఏపీకి నూతన శకం ఆరంభమైంది.. అమరావతి నుంచి ఏపీ పాలన ప్రారంభమైంది. ఏపీ చరిత్రలో కొత్త చరిత్ర లిఖితమైంది.  ఇది మాకో పండుగ’ అని ట్వీట్ చేశారు.

దీనిపై కొంచెం సెటైర్ సమాధానమిచ్చిన కేటీఆర్.. ‘సార్.. మీ నూతన రాజధాని నుంచి పరిపాలన ప్రారంభమైనందుకు అభినందనలు.. అలాగే గొప్పరాజధాని అయిన అమరావతిలో హైకోర్టు వద్దా అని ప్రశ్నించారు. దీంతో పొలిటికల్ పంచ్ హాట్ టాపిక్ అయ్యింది.. నెలరోజులుగా తెలంగాణ నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న స్పందించకుండా హైకోర్టు ద్వారా తెలంగాణను పాలించాలనుకుంటున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ యుద్దం ప్రకటించారని అందరూ చర్చించుకుంటున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *