Breaking News

కాసుల కక్కుర్తి.. వసూళ్ల దందా..

police

తెలంగాణలో పోలీసుల కక్కుర్తి చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కాసుల కోసం వేధిస్తూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్న వైనం ఆశ్చర్యపరుస్తోంది. వసూళ్ల దందాలో రోజుకొకరు చొప్పున పోలీసులు పట్టుబడడం తెలంగాణ పోలీస్ శాఖకు మచ్చను తెస్తోంది..
అప్పట్లో ఎఎస్సై మోహన్ రెడ్డి ఫైనాన్స్ వ్యాపారంతో వేలకోట్లు జమ చేసి వందల మంది భూములను, జాగాలను, అప్పులిచ్చి చిత్రహింసలు చేసి వారి చావులకు కారణమయ్యాడు. ఈ వ్యవహారంలో ఎస్సీ స్థాయి వారు కూడా మోహన్ రెడ్డికి అండగా నిలిచి అతడికి డబ్బులిచ్చి వ్యాపారం చేయించడం విచారణలో విస్మయం గొలిపే వాస్తవాలు వెలుగుచూశాయి.
తాజాగా మెదక్ జిల్లాల్లో ఓ ఎస్సై తన ఉన్నతాధికారులు లంచాలు డిమాండ్ చేయడంతో వాటిని తీర్చే మార్గం లేక సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. నిన్న జరిగిన ఎంసెట్ లీకేజీ విచారణలో భాగంగా వరంగల్ సీఐడీ డీఎస్సీ ఏకంగా నిందితుడి నుంచి లక్ష వసూలు చేసి దొంగను తప్పించాడు. ఈ వ్యవహారం వెలుగుచూసి ఆ డీఎస్పీని డీఐజీ అనురాగ్ శర్మ సస్పెండ్ చేశాడు. ఇలా వరుసగా తెలంగాణ పోలీసుల అవినీతి, అక్రమాలు, వసూళ్ల దందాలు విస్మయం గొలుపుతున్నాయి. డబ్బే పరమావదిగా చెలరేగుతున్న పోలీసుల నుంచి ప్రజలకు న్యాయం దక్కడం ఎండమావే..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *