
ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి.. యూరోపియన్ యూనియన్ నుంచి ఆయూనియన్ లో అతిపెద్ద దేశం, ఆర్తికంగా బలంగా ఉన్న బ్రిటన్ వైదొలగనుంది. ఆ దేశ ప్రజలకు ఇచ్చిన రెఫరెండంలో మూకుమ్మడిగా యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగాలని తీర్పునిచ్చారు. దీంతో యూరోపియన్ యూనియన్ ను ఏర్పాటుకు కారణమైన బ్రిటన్ దేశమే ఇప్పుడు వైదొలగబోతోంది..
ఈ పరిణామాలు ప్రపంచ దేశాల మార్కెట్లపై పడ్డాయి. అన్ని మార్కెట్లు కుదేలయ్యాయి. భారీ నష్టాలను చవిచూశాయి. బ్రిటన్ వైదొలగడంతో పౌండ్ విలువ పడిపోయింది. దానికనుగుణంగా భారత దేశంలో బంగారం ధర భారీగా పెరిగింది.. ఇండియన్ బులియన్ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి.