
ప్రధాని మోడీ జీ తీసుకున్న నిర్ణయంతో దేశమంతా ఇప్పుడు కరెన్సీ కలకలం నెలకొంది. నల్లకుబేరులు , ప్రతీ ఇంట్లో వ్యక్తులు, కుటుంబ సభ్యులు దాచుకున్న దోచుకున్న డబ్బంతా ఇప్పుడు బయటకు తీసుకురావాల్సిన పరిస్తితి ఏర్పడింది.. ఈ పరిణామాలతో బ్యాంకుల్లో డబ్బులు కుప్పలుగా వచ్చిపడుతోంది. దేశంలోని నల్ల డబ్బు తెల్లడబ్బుగా మారుతోంది. లెక్కలు చూపని నల్లడబ్బు ఇప్పుడు మార్చుకోకపోతే డిసెంబర్ 30 తర్వాత అది చిత్తు కాగితాలుగా మిగిలిపోనుంది. దీంతో దోచుకున్న డబ్బంతా ఇప్పుడు బయటకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశంలో నయీం లాంటి గ్యాంగ్ స్టర్ లు, రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తలు ఇప్పుడు తమ బ్లాక్ మనీ ని ఎలా బయటకు తీసుకురావాలో నని ఆందోళనలో ఉన్నారు.
ఇక కుటుంబాల్లో కూడా ఇదే అలజడి నెలకొంది. భార్యలు, అత్తలు, కోడల్లు, మామలు, ఇలా అందరూ అప్పుడో ఇప్పుడో దాచుకున్న డబ్బంతా ఇప్పుడు బయటకు తీస్తున్నారు. దీంతో వారి బండారం బయటపడుతోంది. చదువురాని వారు తప్పనిసరిగా కుటుంబ సభ్యుల్లో చదువుకున్న వారి చెంత చేరుతున్నారు. దీంతో దాచుకున్న దోచుకున్న డబ్బంతా బయటకొస్తోంది. ఇప్పుడు మోడీజీ దెబ్బకు దొంగనోట్లు ముద్రించి భారత్ లో విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న పాకిస్తాన్ కు షాక్ కలగడంతో పాటు దేశంలోనూ నల్ల కుబేరులు, అక్రమార్కుల ఆట కట్టైంది.